అన్నాడీఎంకే మాజీ రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పకు చేదు అనభవం ఎదురైంది. ఢిల్లీలో ఆమె అధికారిక నివాసాన్ని అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. ఇంట్లోని సామాన్లను తీసుకొచ్చి రోడ్డుపై పడేశారు. ఆమెను దివంగత సీఎం జయలలిత పార్టీ నుంచి బహిష్కరించినా రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. పదవీకాలం ముగిసి 2 ఏళ్లైనా క్వార్టర్స్ విడిచి పెట్టకపోవడంతో ఆమె లేని సమయంలో అధికారులు ఖాళీ చేయించారు.