సాలూరు మండలం లోని శనివారం పలు గ్రామాల ప్రజలు నాగులచవితి పండుగ ను ఘనంగా నిర్వహించారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నాగులచవితి పండుగను వారు నివాసం ఉంటున్న గ్రామ సమీపంలోని పుట్టల వద్దకు చేరుకుని శుభ్రపరిచి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నూతన పట్టు వస్త్రాలను ధరించి, తంగేడు పూలతో అలంకరించారు. పుట్టల్లో పాలు, పువ్వులు, గుడ్లు పెట్టి పూజల్లో భక్తులు నిమగ్నం అయ్యారు.