జిల్లాలో గత ఏడాది కన్నా ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గు ముఖం పట్టాయని జిల్లా ఎస్పీ దీపిక ఎం పాటిల్ అన్నారు. శనివారం గజపతినగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది జూలై నెల వరకు రోడ్డు ప్రమాదాల శాతాన్ని పరిశీలించగా గత ఏడాది కన్నా 20 శాతం ప్రమాదాలు తగ్గాయన్నారు. ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న ముందస్తు చర్యల వల్లే రోడ్డు ప్రమాదాలను తమ సిబ్బంది తగ్గించగలిగారన్నారు.
ప్రధానంగా 11 పోలీస్ స్టేషన్ల పరిధిలోనే గంజాయి సరపరా జరుగుతున్నట్లు గుర్తించామని, ఇందుకుగాను ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీములు ఏర్పాటు చేశామన్నారు. దీనివలన మంచి ఫలితాలు వస్తాయని, గంజాయి అమ్మకం దారులు, కొనుగోలుదారులపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. గంజాయితో పట్టుబడే 18-22 సంవత్సరాల యువకులపై కూడా కేసులు పెడుతున్నామని చెప్పారు.
సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. లోన్ యాప్స్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఆన్ లైన్ చెల్లింపులు పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసపోయిన 24 గంటల్లో తమకు సమాచారం అందిస్తే బాధితులకి మేలు చేసే అవకాశం ఉంటుందని అన్నారు. జిల్లాల 3600 పెండింగ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ త్రిబుల్ రైడింగ్ పై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. నిషేదిక ఖైనీ, గుట్కా అమ్మకం దారులపై కేసులు పెడుతున్న, కోర్టులో వీగిపోతున్నాయని చెప్పారు. అలాగే పశుఅక్రమ రవాణా పై నిఘా ఉందన్నారు.
అంతకుముందు రికార్డులు నిర్వహణ, సిబ్బంది పనితీరు, కేసుల పురోగతి వంటి విషయాలను నిశితంగా పరిశీలించారు. అలాగే జైలు వార్డులు, ఫ్యామిలీ కౌన్సిలింగ్ గదులను కూడా జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. కార్యక్రమంలో బొబ్బిలి డిఎస్పి మోహనరావు, గజపతినగరం సి. ఐ లెంక అప్పలనాయుడు, ఎస్. ఐ సి. హెచ్. గంగరాజులు పాల్గొన్నారు.