కొత్తగా మంజూరైన ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలని గజపతినగరం జడ్పిటిసి గార తౌడు అన్నారు. శనివారం గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో గృహ నిర్మాణాలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజపతినగరం మండలానికి 722 కొత్తగా ఇళ్లు మంజూరు అయినట్లు చెప్పారు. ముందుగా నిర్వహించే రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అనంతరం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ డి. ఈ సత్యనారాయణ, ఎంపీడీవో కొవ్వాడ కిషోర్ కుమార్, గృహ నిర్మాణ శాఖ ఏ. ఈ శామ్యూల్, వైసిపి నాయకులు బెల్లాన త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు.