పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండలంలో శనివారం పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు పర్యటిస్తారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి దర్శి వెంకటేశ్వరావు తెలిపారు. శాసన సభ్యులు శంకరరావు పర్యటనను వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కార్యదర్శి వెంకటేశ్వరావు విజ్ఞప్తి చేశారు.