మహిళను లైంగికంగా వేధించాడంటూ ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసి బాధితురాలి బంధువులు హత్య చేశారు. హర్యానాలోని పరీధాబాద్లో జరిగిందీ ఘటన. నిందితులందరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ''లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయడానికి కొందరు పోలీస్ స్టేషన్కు వచ్చారు. మరికొందరు వ్యక్తి ఇంట్లోకి వెళ్లి దాడి చేసి దారుణంగా హత్య చేశారు." అని పోలీసులు తెలిపారు.