ఫిలిప్పీన్స్ లో తుపాను విలయం సృష్టించింది. భారీ వర్షాలు, వరదలు కారణంగా కొండచరియలు విరిగిపడి దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రావిన్స్‌లో 42 మంది దుర్మరణం చెందారు. మరో 16 మంది గల్లంతయ్యారు. కొంత మంది ఇళ్ల పైకప్పులపై చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. ఈ కుండపోత వర్షాలకు చాలా మంది నిరాశ్రయులయ్యారు. కొందరు కొట్టుకుపోయారు. ఈ భారీ వర్షాలకు నాల్గే సైక్లోన్ నే కారణం. వరదలో చిక్కుకున్న 5వేల మందిని కోస్ట్ గార్డు, పోలీసులు, వాలంటీర్లు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.