వైయస్సార్ జిల్లాలో పొలాల్లోని విద్యుత్ తీగలకు నలుగురు అన్నదాతలు బలయ్యారు. పంటకు పురుగుల మందు పిచికారీ చేసేందుకు వెళ్లారు మళ్లిఖార్జున్, పెద్దిరెడ్డి, బాల ఓబుల రెడ్డి. పొలంలో పడి ఉన్న విద్యుత్ తీగను ఒకరు తొక్కి వెంటనే షాక్ తగిలి పడిపోయారు. ఆయన్ని కాపాడబోయి మిగిలినవారూ చనిపోయారు. మోటారు ఫ్యూజులు సరిచేస్తూ అదే జిల్లాకు చెందిన చంద్రశేఖర్ మృతిచెందారు. కోనసీమ జిల్లాలోని ఓ పాఠశాలలో నిర్లక్ష్యంగా వదిలేసిన విద్యుత్ తీగ కారణంగా ఓ విద్యార్థి చనిపోయాడు.