ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా శ్రీ గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు శనివారం మాడుగుల్లో ప్రారంభమయ్యయి. 15 రోజులు పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గౌరీ పరమేశ్వరులను ప్రజలు దర్శనార్థం గ్రామంలో ఊరేగించి స్థానిక గౌర వీధిలో గల రామాలయంలో కొలువుంచుతారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు భజనలు నిర్వహించి అనంతరం అనుపుత్సవాన్ని నిర్వహిస్తారు. గౌరీ పరమేశ్వరుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉత్సవాలను జయప్రదం చేసి అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.