ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో దళాల అలికిడి కలకాలం సృష్టిస్తోంది. మావోయిస్టుల కదలికలతో ఆంధ్ర ఒడిశా పోలీసులు నిరంతరం అప్రమత్తమౌతూ ఏరియా డామినేషన్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు మల్కన్‌గిరి జిల్లాలో జోడంబో పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం పోలిసులు బిఎస్ఎఫ్ బలగాలు ఏరియా డామినేషన్ నిర్వహించగా కొసొంపుట్ అటవీ ప్రాంతంలో భారీగా మావోయిస్టుల సామాగ్రి లభ్యమైంది. ఇందులో మావోయిస్టులకు చెందిన రెండు రైపిల్ గన్ లు రెండు నాటు తుపాకులు ల్యాండ్ మైన్ క్యారేజ్ బాంబులకు సంబంధించిన తదితర భారీ సామాగ్రిలు లభ్యమైందని మల్కన్ గిరి పోలీసులు తెలిపారు.