ఏపీ నిట్లో బయోటెక్నాలజీ ఒప్పంద ఆచార్యుడు తమిళ్మణి వైవా పేరుతో అమ్మాయిలను ఒంటరిగా పిలిచి ఒంటిపై చేతులు వేయటం, అసభ్యంగా మాట్లాడుతుండటంతో విద్యార్థులు శుక్రవారం కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. యాజమాన్యం బెదిరింపులకు భయపడకుండా అతడిని డిస్మిస్ చేయాలంటూ నినదించారు. దీంతో అతడిని తొలగించామని చెప్పిన నిట్ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ తగిన చర్యలు తీసుకుంటామన్నారు.