గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ అన్నారు. సోంపేట మండలంలోని సుంకిడి పంచాయతీ విక్రాంపురం గ్రామంలో సీసీ రహదారి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సుంకిడి, ఎంజీపురం సర్పంచ్లు శిలగాన భాస్కరరావు, ఎస్. హరీష్ కుమార్, మాజీ సర్పంచ్ బతకల మోహనరావు తదితరులు పాల్గొన్నారు.