పెళ్లి కోసం ఏకంగా ఓ పెళ్లికొడుకు అడ్జెస్ట్ మెంట్ సూత్రాన్ని పాటించాడు. పెళ్లి వేడుకలో భాగంగా బరాత్‌లో వరుడు గుర్రంపై ఊరేగే సంప్రదాయం చాలా కీలకమైనది. కొన్ని ప్రాంతాల్లో దీనిని చాలా గౌరవప్రదంగా భావిస్తారు. అసలు వరుడు గుర్రంపై ఊరేగకుండా పెళ్లి తంతు ముగియదు. అయితే అలా ఊరేగింపుల్లో చాలా విచిత్రాలు జరిగే అవకాశాలు ఉంటాయి. చాలాసార్లు గుర్రాలు బెదిరిపోయి.. పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సోషల్ మీడియాలో నవ్వులు పూయించాయి.
అయితే ఇప్పుడు ఓ వరుడు గుర్రం.. కాదు గాడిదపై ఊరేగాడు. రోటీన్‌కు భిన్నంగా ఇలా చేశాడనుకుంటే.. పొరపాటే. గుర్రం దొరకక.. గాడిద మీద ఊరేగాడు. అంటే గుర్రం లేక.. గాడిదతో అడ్జస్ట్ అయ్యాడు. గుర్రం అందుబాటులో లేకపోవడంతో ఒక పెళ్లి కొడుకు గాడిదపై ఊరేగింపుగా పెళ్లికి వెళ్లాడు. గాడిద మీద వెళ్లి.. మిగతా తంతు మొత్తం చాలా సంప్రదాయంగానే చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమైంది. పైగా "గుర్రం లేకపోతే ఏం గాడిద ఉందిగా" అని దానికి క్యాప్షన్ పెట్టారు.
ఆ వీడియోలో వరుడు గాడిదపై కూర్చుని ఉండగా.. అతడి బంధువులు దాని ముందు డ్యాన్సులు చేస్తారు. మహిళలు కూడా హారతులు ఇస్తారు. అనంతరం వరుడు ఆ గాడిదపై ఊరుగుతూ పెళ్లి మండపానికి చేరుకుంటాడు. బరాత్‌లో వరుడు గాడిదపై ఊరేగిన ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీనిపై నెటిజన్లు ఓ రేంజ్లో స్పందించారు. లాఫింగ్ ఏమోజీలతో పాటు పలు జోకులు కూడా పేల్చారు. పైగా "ఇది నా స్నేహితుడి పెళ్లి" ఒకరు కామెంట్ పెట్టగా.. మరికొందరు ఆ పెళ్లికొడుకుకి అభినందనలు తెలియజేశారు.