ఇతరును ఆకట్టుకొనేందుకు నేడు యువత సాహసపూరిత క్రీడలకు సిద్దమవుతున్నారు. నిప్పుతో చెలగాటం వద్దని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అయినా కొంతమంది ఆ మాటను పెడచెవిన పెడుతున్నారు. దాంతో దుష్ఫరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ యువకుడు ఫైర్‌తో ఆటలు ఆడి మూతి కాల్చుకున్నాడు. అక్కడున్నవారు అప్రమత్తంగా ఉండడంతో.. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కొన్ని సాహసమైన పనులు చేసినప్పుడు కొంత ప్రాక్టీస్ చేయాలి. దానికి విరుద్ధంగా చేస్తే.. జరగ్గకూడనవి జరుగుతాయి.
ఓ పూజా పండల్‌లో ఓ వ్యక్తి.. నోట్లో పెట్రోల్ పోసుకుని.. నిప్పుతో స్టంట్ చేయబోయాడు. కానీ విఫలమయ్యాడు. ఊహించని ప్రమాదం జరిగి.. తడబడిపోయాడు. యువకుడు ఓ టేబుల్ ఎక్కి.. నోటిలో పెట్రోల్ పోసుకుని.. నిప్పు ఉన్న కర్ర ముందు దానిని ఊదేందుకు ప్రయత్నించాడు. దాంతో అతని గడ్డానికి మంటలు అంటుకున్నాయి. దాంతో కొన్ని సెకన్లపాటు వణికిపోయాడు. అక్కడున్న ఇతర యువకులు వెంటనే అప్రమత్తమయ్యారు. గడ్డానికి అంటుకున్న మంటలను ఆపడానికి ప్రయత్నించారు. అదృష్టవశాత్తు మంటలు ఆగాయి.
దీనికి సంబంధించిన వీడియోను అక్టోబర్ 6న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు 12.3 మిలియన్ల మంది చూశారు. దీనిపై యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక విన్యాసాలు చేసినందుకు వ్యక్తిని విమర్శించారు. నిప్పుతో ఆడకండి.. కాలిపోతారని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. సోదరా ఇలాంటి వాటితో జీవితాన్ని కోల్పోతారు జాగ్రత్త అని మరొకరు కామెంట్ పెట్టారు.
ఈ మధ్య కాలంలోనే ఇలాంటి ఓ సంఘటన జరిగింది. గుజరాత్‌లో ఓ యువకుడు ఫైర్ హెయిర్ కట్ ట్రై చేశాడు. ఈ విధానంలో జుట్టు కత్తిరించే సమయంలో ముందు నిప్పంటించి.. హెయిర్ కట్ చేస్తారు. వల్సాద్ జిల్లాలో ఈ హెయిర్ కట్ కోసం సెలూన్‌కు వెళ్లాడు. అయితే తలపై ఒక కెమికల్ అప్లై చేసి.. తర్వాత ఫైర్ అంటించబోయాడు. దాంతో అనుకోకుండా తలంతా మంట అంటుకుంది. ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. దాంతో తల, మెడకు తీవ్రగాయాలయ్యాయి. ఆ యువకుడు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.