గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చు డ్యామ్‌పై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 132కి చేరుకుందని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలను ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక దళాలు ముమ్మరం చేశాయి. బ్రిటిష్ కాలం నాటి ఈ తీగల వంతెనపై 500ల మంది ఒకేసారి చేరడంతో అది నదిలో కూలిపోయింది.