కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. గత నెలలో పంచామృతాభిషేకం టికెట్ ధరలను పెంచిన వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బంగారు విభూది పట్టి మాయం ఘటనలో ప్రధాన అర్చకులు ధర్మేశ్వర్‌పై ప్రభుత్వం వేటు వేసిందని దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కాణిపాకం ఆస్థాన మండపంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన అర్చకుడిని సస్పెండ్ చేస్తూ ఈవో ఆదేశాలు జారీ చేసినట్లు మీడియాకు తెలిపారు. విభూది పట్టిని మాయం చేసి 41 రోజుల పాటు ఇంట్లోనే పెట్టుకుని ధర్మేశ్వర్. రూ. 18 లక్షల విలువైన విభూది పట్టికి రశీదు లేకపోవడంపై ఫిర్యాదు అందడంతో విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు.