నిత్యం తగు మోతాదులో నీటిని తాగాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటివి తాగాలి. అరటి, పైనాపిల్, పుచ్చకాయలను తినాలి. ఎండలో తిరగాల్సి వస్తే తలకు క్యాప్ ధరించాలి. ఎండలో తిరగడం వల్ల తలనొప్పి వస్తే కొంతసేపు చల్లని నీడలో ఉండాలి. చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. అల్లాన్ని నమిలినా లేదా ఒక గ్లాసు వేడి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగినా తలనొప్పి తగ్గుతుంది. మంచి నిద్ర ఉండాలి. వ్యాయమం చేయాలి.