కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం ముదివేడులో చోటుచేసుకుంది. ముదివేడికి చెందిన మనోహర్ రెడ్డి కుటుంబ విషయం భార్యతో గొడవపడ్డాడు. మనస్థాపానికి చెందిన మనోహర్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.