రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్టేడియాలను ప్రైవేటు కాంట్రాక్టర్లకు లీజుకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నాది అని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో దీనిని జిల్లా వ్యాప్తంగా అడ్డుకుంటామని జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి పత్రిక ప్రకటన లో సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్టేడియాలను పే అండ్ ప్లే పేరుతో ప్రవేటు కాంట్రాక్టర్లకు లీజ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ(శాప్) నిర్ణయం తీసుకొని, దీనికి సంబంధించిన టెండర్లు కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనిని భారత ప్రజాతంత్ర యువజన సంఘం గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియం లో షటిల్ బ్యాట్మెంటన్ కోర్టులను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకు టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. దీనిని జిల్లా క్రీడాకారులు, క్రీడా అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. ఇదే కాక జిల్లాలోని నీలం సంజీవరెడ్డి స్టేడియం నార్పల కళ్యాణ్ దుర్గం లోని అన్ని స్టేడియాలను ప్రైవేటుపరం చేయడం పేద, మధ్యతరగతి విద్యార్థులు , యువజనులను ఆటలకు దూరం చేయడం అవుతుంది అని అన్నారు. క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించి ఉచిత శిక్షణ ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆటస్థలాలను ఇలా ప్రైవేటు వ్యక్తులు లీజుకి ఇవ్వడం చాలా దారుణం అన్నారు. ప్రభుత్వ స్టేడియాలను ప్రైవేటు వ్యక్తులకు నీతులు పేరుతో ఇచ్చిన నిర్ణయం పైన డివై ఎఫ్ ఐ గా క్రీడాకారులను, క్రీడా అభిమానులు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలిపారు.