పర్చూరు సబ్ డివిజన్ లోని నాలుగు మండలాల్లో ఈక్రాప్ బుకింగ్ చేసుకున్న రైతుల వివరాలను రైతు భరోసా కేంద్రాలలో నోటీసు బోర్డుల్లో పెట్టామని, వాటిని రైతులు పరిశీలించుకొని ఏమైనా తప్పులు ఉంటే మంగళవారం సాయంత్రం లోపు తమ దృష్టికి తేవాలని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మోహనరావు తెలిపారు. ఈ తప్పులను సరి చేసుకోకపోయినట్లయితే రైతులు నష్టపోతారన్నారు. నవంబర్ 5న తుది జాబితా ప్రకటించాక ఇక మార్పు చేర్పులకు అవకాశం ఉండదన్నారు. అందువల్ల రైతులు త్వరపడి తమ వివరాలను మరోసారి పరిశీలించుకోవాలని మోహనరావు సూచించారు