ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సంక్షేమమే సిఎం జగన్ లక్ష్యం: ఎమ్మెల్యే వైవిఆర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 31, 2022, 01:17 PM

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యం గా సిఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని గుంతకల్లు నియోజక వర్గ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి అన్నారు. సోమవారం గుంతకల్లు పట్టణంలోని 12 వ వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ చిన్నం వెంకటేసులు ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వై. వెంకటరామి రెడ్డి హాజరై గడపగడపకు తిరుగుతూ ప్రజా సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అంటూ మహిళలను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మున్సి పల్ చైర్ పర్సన్ ఎన్. భవాని, కమీష నర్ బండి శేషన్న, వార్డు వైకాపా ఇంచార్జ్ ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com