జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తిరుపతికి చెందిన శ్రీమతి పరింగిశెట్టి కీర్తనను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. శ్రీమతి కీర్తన 2016 నుంచి పార్టీకి సేవలు అందిస్తున్నారు. 2019 ఎన్నికల అనంతరం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలను బలంగా జనంలోకి తీసుకెళ్లడంతోపాటు టెలివిజన్ చర్చల్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.