పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి చెందిన జనసైనికుడు మారిశెట్టి శ్రీనివాసరావుపై స్థానిక వైసీపీ పార్టీ నాయకులు భౌతిక దాడి చెయ్యడమే కాకుండా తిరిగి బాధితునిపైనే అక్రమంగా కేసు బనాయించారు అని జనసేన నాయకులూ తెలియజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... స్థానిక వైసీపీ నాయకులు మరియు పోలీసు వారి నుంచి వస్తున్న ఒత్తిళ్లను భరించలేక బాధితుడు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మా జనసైనికుడు శ్రీనివాసరావుకి మద్దతుగా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో సీఐ గారిని అసలైన నిందితులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసాము. పిమ్మట మా జనసైనికుడు శ్రీనివాసరావుని మెరుగైన వైద్యం కొరకు గుంటూరు తరలించాము. వైద్యానికి అవసరమైన ఖర్చు మొత్తం జనసేన పార్టీ భరిస్తుందని బాధితుడి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చాము అని తెలియజేసారు.