పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ ఆధ్వర్యంలో భారతదేశ మొదటి ఉప ప్రధాని మరియు దేశ మొదటి హోంశాఖ మంత్రి స్వర్గీయ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకుని నరసరావుపేట పట్టణంలో రాష్ట్రీయ ఐక్యత దినోత్సవంను పల్నాడు జిల్లా పోలీసులు ఘనంగా నిర్వహించినారు . ఈ సందర్భంగా చేపట్టిన ఐక్యత కోసం పరుగు(Run for Unity) కార్యక్రమాన్ని పట్టణంలోని స్థానిక మల్లమ్మ సెంటర్ నందు పల్నాడు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శ్రీ శ్యాంప్రసాద్ గారితో కలసి జెండా ఊపి ఎస్పీ ప్రారంభించారు.