రాజమండ్రిలో వైసీపీ పార్టీ నిర్వహిస్తున్న కాపు ప్రతినిధుల సమావేశాల నేపథ్యంలో అమలాపురంలో నిరసన తెలియజేసిన కాపుయువత. కేవలం పవన్ కళ్యాణ్ మీద అవాకులు చవాకులు పేలడం కాపులకు ముఖ్యమంత్రి అన్యాయం చేస్తుంటే వైసీపీ కాపు ప్రతినిధులు ఏమి చేస్తున్నారు? కాపులను బి సి ల్లో చేర్చాలని జగన్ రెడ్డి గారిని ఎందుకు డిమాండ్ చేయడంలేదు? కాపులకు 5% రిజర్వేషన్స్ కోసం ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడంలేదు ? ప్రతీ సంవత్సరం కాపు కార్పొరేషన్ కు 2000 కోట్లు ఇస్తానని వాగ్దానం చేసి ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వని ముఖ్యమంత్రిని అడిగే దమ్ములేదా? అని ప్రశ్నించారు.