కాపులకు సీఎం జగన్ పెద్ద పీట వేశారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబు గతంలో రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేయడమే కాకుండా ముద్రగడ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. ఇటీవల కాపు ఎమ్మెల్యేలను పవన్ దూషించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి దిగజారి మాట్లాడతారా?, రంగా మరణానికి పవన్ కల్యాణ్ కొత్త భాష్యం చెప్పారు. రంగా హత్యకు కారణమైన చంద్రబాబుతో పవన్ జట్టు కట్టారు. టీడీపీ హయాంలో కాపులను వేధిస్తే.. సీఎం వైయస్ జగన్ అన్ని రకాలుగా అండగా నిలిచారు. పవన్ ముసుగు తొలగింది. కాపు సోదరులు ఆ విషయం గుర్తించాలని మంత్రి అంబటి రాంబాబు కోరారు. ఒక్క కలం పోటుతో సీఎం వైయస్ జగన్ కాపుల మీద కేసులు ఎత్తేశారని గుర్తు చేశారు. కాపులను ప్రేమతో చూసుకుంది వైయస్ఆర్, వైయస్ జగన్ మాత్రమే అని పేర్కొన్నారు. కాపుల శత్రువు చంద్రబాబు. చంద్రబాబుకు కాపులను తాకట్టు పెట్టడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ సీఎం కావడం కోసం కాదు.. చంద్రబాబును సీఎం చేయడానికి జనసేన ప్రయత్నం చేస్తోందని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.