కుప్పం మండలం ఆవులనత్తం గ్రామంలో బుధవారం ఎమ్మెల్సీ భరత్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెల్లి గత మూడు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల బుక్ లెట్ అందించి, ఏమేరకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందారో వివరించారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను భరత్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసీ శరవణ, సర్పంచులు, ఎంపిటిసీలు, అధికారులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.