అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో ని మద్యం దుకాణం వద్ద రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మద్యం కొనుగోలు కు బిల్లులు అడగగా మద్యం దుకాణాదారులు ఇవ్వలేదని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్యం అమ్మకాలకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. బిల్లులు ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడు తున్నారని ఆరోపించారు. పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు.