టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్టు అప్రజాస్వామికమని రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్య ప్రసాద్ అన్నారు. తెల్లవారుజామున అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడిని అరెస్టు చేసిన విధానం చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందన్నారు. జగన్ అవినీతి, అక్రమాలు ప్రశ్నించినందుకే ఆయన పాత్రుడిని అరెస్టు చేశారని సత్య ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.