ముప్పాళ్ళ మండలంలోని నార్నెపాడు, పలుదేవర్లపాడు, చాగంటి వారి పాలెం గ్రామాలలో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. పలు చట్టాలపై మొదటి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె. ప్రశాంతి అవగాహన కల్పించారు. లోక్ అదాలత్ వల్ల ప్రయోజనాలను వివరించి కేసులను రాజీ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పట్టాభిరామయ్య, న్యాయవాది అమర్ నాయక్, పారా లీగల్ వాలంటీర్ కుమారి పాల్గొన్నారు.