కావలసిన పదార్థాలు:
బ్రెడ్ ముక్కలు: నాలుగు, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిగడ్డ: ఒకటి, టమాట: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, జీడిపప్పు: పది, జీలకర్ర, ఆవాలు: అర టీస్పూన్ చొప్పున, అల్లం: అంగుళం ముక్క, కరివేపాకు: ఒక రెబ్బ, కొత్తిమీర తురుము: కొద్దిగా, కారం: అర టీస్పూన్, సాంబారు పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, పసుపు: పావు టీస్పూన్.
తయారీ విధానం:
స్టవ్‌మీద పాన్‌పెట్టి నెయ్యి వేయాలి. బాగా వేడయ్యాక బ్రెడ్ స్లైసెస్ వేసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. కాల్చిన బ్రెడ్‌ను రెండంగుళాల ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నూనెవేసి.. వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వేసి.. మంచిగా వేగాక తరిగిన టమాట ముక్కలు, కారం, ఉప్పు, సాంబారుపొడి, పసుపు వేయాలి. మొత్తంగా కలగలిపి మూతపెట్టి సన్నని మంటపై రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కల్ని జోడించి.. బాగా కలిపి కొద్దిగా నీళ్లు చల్లి ఇంకోసారి కలపాలి. పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి బ్రెడ్ ఉప్మా సిద్ధం.