ఆరోగ్యకరమైన వ్యక్తిలో నాలుక లేత గులాబీ రంగులో ఉంటుంది. అలాగే తేమగా, మృదువుగా కూడా ఉంటుంది. నాలుక పాలిపోయి తెల్లగా ఉంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. నాలుక ఊదా రంగులో ఉంటే రక్త ప్రసరణ లోపాలున్నట్లు గుర్తించాలి. ఎరుపు రంగులో ఉంటే విటమిన్ బి-12, ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్నట్లుగా భావించాలి. అతిగా యాంటీ బయాటిక్స్ తీసుకొనే వారిలో నాలుక నలుపు రంగులో కనిపిస్తుంది.