గుంటూరు: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ గురువారం గుంటూరులో టీడీపీ నేతలు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వ అక్రమాన్ని, అరాచకాల్ని, ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తారా అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడలు దూకింది పోలీసులా లేక వైసీపీ కార్యకర్తలా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని కోవెలమూడి రవీంద్ర, డేగల ప్రభాకర్ అన్నారు.