టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఇంట్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సత్యసాయి జిల్లా పెనుగొండలోని ఆమె గృహంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే సీబీఐ బృందం పెనుకొండకు చేరుకుంది.కర్ణాటకలో నమోదైన ఒక కేసు విషయంలో ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం.ఆమె ఇంట్లోని రికార్డులను, ఇతర లావాదేవీలను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు.