కరోనా వైరస్ రెండున్నరేళ్లుగా ప్రంపచాన్ని వణికిస్తోంది. కరోనా కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్ కు చెందిన 59 ఏళ్ల వ్యక్తికి 2020 డిసెంబర్ లో ఫస్ట్ వేవ్ లో కరోనా సోకింది. అప్పటి నుంచి 411 రోజుల పాటు ఆయన చికిత్స పొందుతూనే ఉన్నారు. పెర్సిస్టెంట్ కోవిడ్ ఇన్ఫెక్షన్ లాంగ్ కోవిడ్ కారణంగా ఆయన బాధపడ్డారని, వైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించడం ద్వారా నయం చేశామని బ్రిటన్ పరిశోధకులు తెలిపారు.