ఉద్యోగుల పెన్షన్ పథకం(ఈపీఎస్)లో ఉన్న రూ. 15 వేల పరిమితి నిబంధనను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. 2014 నాటి ఉద్యోగుల పెన్షన్ (సవరణ) పథకం చెల్లుబాటును సమర్థించింది. పెన్షన్ పొందడానికి ఉద్యోగుల నెలవారీ వేతనం గరిష్టంగా రూ. 15,000 ఉండాలనే నిబంధనను కొట్టివేసింది. గతంలో వేతనం ఎంత ఉన్నా పెన్షన్ మాత్రం రూ. 15 వేలకు మాత్రమే లెక్కించాలనే నిబంధన ఉండేది. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో ఆ నిబంధన రద్దయింది.