వరి పంట... మనదేశంలో రైతులు పండించే ప్రధాన పంటలో ఒకటి. భారతదేశం వరి ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. అయితే ఈ ఏడాది అనూహ్య వాతావరణ పరిస్థితులతో వరి ఉత్పత్తి తగ్గిపోయింది. వాతావరణ మార్పుల దుష్ఫలితంగా దేశవ్యాప్తంగా వరి దిగుబడి పడిపోతుంది. వాతావరణ మార్పుల కారణంగా రానున్న కాలంలో వరి దిగుబడి మరింతగా పడిపోవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.