చంద్రబాబు కనుసైగ చేస్తే మా కార్యకర్తల చేతిలో వైసీపీ గూండాల పరిస్థితి ఏంటి? ఆని టీడీపీ ఏపీ అద్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన రోడ్ షోపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం, ఆ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుకు గాయాలు కావడంపై అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు.
చంద్రబాబు రోడ్ షోపై జరిగిన దాడిని ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా అచ్చెన్న శుక్రవారం రాత్రి ఓ పోస్ట్ పెట్టారు. ''చంద్రబాబు గారిపై రాళ్ల దాడి వైసీపీ రౌడీ రాజకీయానికి పరాకాష్ఠ. దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? రౌడీ రాజకీయాలతో భయపెట్టాలనుకోవడం మీ కల. చంద్రబాబు కనుసైగ చేస్తే మా కార్యకర్తల చేతిలో వైసీపీ గూండాల పరిస్థితి ఏంటి? దాడి చేసిన వారిని, దాడి చేయించినవారిని వెంటనే అరెస్ట్ చేయాలి'' అని అచ్చెన్న డిమాండ్ చేశారు.