రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడిన ఘటన మన్నసముద్రం సమీపంలో రేణిగుంట- నాయుడుపేట ప్రధాన రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. ఏర్పేడు సీఐ శ్రీహరి కథనం మేరకు కుప్పయ్యకండ్రిగ కు చెందిన కేశవులు, దేశమ్మ ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు అదుపు తప్పి ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వైద్యం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa