రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి దాహంతోనే వైసిపి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల పైన కోర్టు కేసులు పెడుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి మండిపడ్డారు. పెనుమూరు మండలం కేంద్రంలోని శుక్రవారం నిర్వహించిన మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకరానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు. సంక్షేమ పథకాలను ప్రతి గడపగడపకు అందించడమే జగనన్న ఉద్దేశమని కొనియాడారు.