తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్‌కు అనుమతి వస్తే ఇది మా ప్రాంతానికి వద్దు, మాకు అవసరం లేదని టీడీపీ నేతలు లేఖలు రాశారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది చూసి, వస్తున్న పారిశ్రామికవేత్తలను చూసి ఓర్వలేక రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్‌కు అనుమతి వస్తే ఇది మా ప్రాంతానికి వద్దు, మాకు అవసరం లేదని లేఖలు రాస్తారు, జరుగుతున్న అభివృద్ది చూసి, వస్తున్న పారిశ్రామికవేత్తలను చూసి ఓర్వలేక రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. కళ్ళు విప్పి చూడమని వారికి చెబుతున్నా, రానున్న రోజుల్లో శ్రీ జగన్ గారి నేతృత్వంలో పారిశ్రామిక అభివృద్దిని మరింతగా ముందుకు తీసుకెళతాం అని ధీమా వ్యక్త పరిచారు.