ప్రస్తుత రోజుల్లో ఏ వయసు వారికైనా బండి సర్వసాధారణమైంది. అయితే బండి మైలేజీ విషయంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. పలు జాగ్రత్తల ద్వారా బండి మైలేజీని పెంచుకోవచ్చు. రెగ్యులర్ సర్వీసింగ్ చేయించడం, ఇంజిన్ ఆయిల్ మార్చడం,టైర్లలో గాలి సరిచూసుకోవడం, పరిమితమైన స్పీడుతో వెళ్లడం లాంటి తదితర టిప్స్ ను పాటిస్తే మైలేజి తప్పక పెరుగుతుంది. అంతేకాకుండా విడిభాగాలను పదే పదే మార్చకుండా ఉంటే ఇంకా ఫలితముంటుంది.