తమిళనాడులోని తెన్‌కాశిలో ముగ్గురిపై ఎలుగుబంటి దాడి చేసింది. అటవీ ప్రాంతంలో ఆదివారం బైక్ వెళ్తున్న ఒకరిని కొంద పడేసి కొరికేసింది. అడ్డుకోబోయిన ఇద్దరు గ్రామస్తులపై కూడా ఆ ఎలుగుబంటి దాడికి దిగింది. ఇంతలో ప్రజలు భారీగా వచ్చి, రాళ్లు విసిరారు. దీంతో ఆ ఎలుగుబంటి భయపడి అడవిలోకి పరుగులు తీసింది. అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa