ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని విశ్వనాధపురం బ్యాంకి కాలనీ నందు ఆదివారం రాత్రి ఓ ఇంట్లో ఎవరు లేని సమయంలో భారీ చోరీ చోటు చేసుకుంది. ఈ దొంగతనంలో సుమారు లక్ష ఇరవై వేల రూపాయలు 10 సవర్ల బంగారం దోచుకెళ్ళినట్లు బాధితులు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న పొదిలి ఎస్ఐ శ్రీహరి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దింతో క్లూస్ టీం సంఘటన స్థలాన్ని జల్లెడ పట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa