ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివ నామస్మరణతో మార్మోగిన శివాలయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 07, 2022, 01:23 PM

శివనామస్మరణతో శివాలయాలు మార్మోగాయి. కార్తీక మాసం రెండవ సోమవారం తో పాటు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలతో భక్తులు పోటెత్తారు. ఓం నమశ్శివాయ, హర హర మహా శంభో అంటూ మార్మోగించారు. ఉమా రామలింగేశ్వర ఆలయంతో పాటు మల్లికార్జున స్వామి ఆలయంలో శివలింగాలకు క్షీరాభిషేకం, పంచామృతాభిషేకంలు నిర్వహించారు. భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఉమా రామలింగేశ్వరాలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఏర్పాట్లు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com