మహాకవి గురజాడ వెంకట అప్పారావు వర్ధంతిని పురస్కరించుకుని గురజాడ సాహితీ చైతన్యోత్సవంలో భాగంగా కవితల పోటీలను నిర్వహిస్తున్నట్లు సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వచన కవిత, గేయం, ముత్యాల సరం ఏదైనా 15 నుంచి 20 లైన్లకు మించరాదన్నారు. రచనలు సామాజిక చైతన్యం కలిగి ఉండాలని, శైలి సులభ సుందరంగా ఉండాలని మహాకవి గురజాడ గుర్తుకు రావాలన్నారు.
ఈ నెల 20లోపు రచనలను డాక్టర్ జక్కు రామకృష్ణ 8309176126, మానాప్రగడ సాహితి 9989370358 నంబర్లకు వాట్సాప్ ద్వారా పంపించాలన్నారు. బహుమతులు పొందిన కవితను నవంబరు 30న గురజాడ వర్ధంతి రోజున ఉదయం సాహితీ సభలో పఠించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న ఆభ్యర్థులు పోటీల్లో పాల్గొనాలని కోరారు