ఏపీ సీఎం జగన్ సోమవారం వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఎంఎస్పీ ధర కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చింది అనే మాట ఎక్కడా రాకూడదని అన్నారు. ప్రతి ఆర్బీకేలో ఒక డ్రోన్ ను ఉంచాలని, వచ్చే రెండేళ్లలో అన్ని ఆర్బీకేల్లో డ్రోన్స్ ఉండేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. భూసార పరీక్షలు చేసే పరికరాలను ప్రతి ఆర్బీకేలో ఉంచాలని, మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.