జమ్మలమడుగు పట్టణంలోని 16వ వార్డులో సోమవారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ వేల్పుల శివమ్మలు ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేస్తారని తెలిపారు.