ట్విట్టర్‌లో ఉద్యోగుల కోతపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. 50 శాతం ఉద్యోగులపై వేటు వేస్తూ మస్క్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. ''భారత్‌లో ట్విట్టర్ ఉద్యోగుల్ని తొలగించడాన్ని మేం ఖండిస్తున్నాం. మరో ఉద్యోగంలోకి మారేందుకు వారికి తగినంత సమయం ఇచ్చి ఉండాల్సింది." అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒక ప్రకటనలో తెలిపారు.