రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి అంటూ ప్రజలను ఆరా తీశారు. సోమవారం గుంతకల్లు పురపాలక సంఘం 32 వ సచివాలయం పరిధి లో 36 వ వార్డులో ఆ వార్డు కౌన్సి లర్ కుమారి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన ఇంటికి వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అంటూ ఆరా తీశారు. అదేవిధంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భవాని, వైస్ చైర్ పర్సన్స్ మైమున్, కమిషనర్ బండి శేషన్న, మాజీ మున్సిపల్ ఛైర్మన్లు రామ లింగప్ప, జింకల రామాంజినేయులు, కౌన్సిలర్లు, మునిసిపల్, సచివాలయ, హౌసింగ్, ఎలక్ట్రికల్ సిబ్బంది, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.